అక్షర ఫౌండేషన్

మానవసేవే మాధవసేవ అనే మాటలను అక్షర సత్యాల్ని చేస్తూ సమాజ సేవే లక్ష్యంగా గ్రామీణ భారతావని రూపురేఖల మార్పునకు నిరంతరం కృషి చేస్తోన్న సంస్థ అక్షర ఫౌండేషన్.






 

నవంబర్ 11, 2008 లో సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చందుపట్ల వాసి యాస రాంకుమార్ రెడ్డిచే స్థాపించబడిన 


ఈ ఫౌండేషన్ సమాజ సేవే లక్ష్యంగా పని చేస్తోంది. 

రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ కందుకూరి వీరేశలింగం పంతులు, స్వామి వివేకానంద ఆర్గనైజేషన్ లో పని 


చేస్తుండగా ప్రేరణ పొంది రాంకుమార్ రెడ్డి అక్షర ఫౌండేషన్ ప్రారంభించారు.

ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థులకు ఉచిత శిక్షణ, మోడల్ టెస్టుల నిర్వహణ.

ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రస్త్రచికిత్సలకు చేయూత నివ్వడం.

విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.

సందర్భాన్ని బట్టి పలు అంశాలపై ప్రజలకు అవగాహణ, చైతన్య సదస్సుల నిర్వహణ ( కరోనా సమయంలో ప్రజలకు విస్తృత అవగాహనా కార్యక్రమాలు).

ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు, దివ్యాంగులకు చేయూత నివ్వడం.

పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం.

విద్యార్థులు, యువతకు నైపుణ్య అభివద్ధి కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన. 

No comments:

Post a Comment

Pages